ETV Bharat / jagte-raho

మాజీ ఎమ్మెల్యే కుమారుడు, అనుచరులపై కేసు నమోదు - మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి తాజా వార్తలు

ఏపీలోని పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కుమారుడు కొండారెడ్డిపై బంజారాహిల్స్​ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. స్థలం విషయంలో కొండారెడ్డి తనని బెదిరించాడని శివ గణేశ్​​ అనే వ్యాపారి ఫిర్యాదు చేయగా అతనితో పాటు మరో 17మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Banjarahills Police Station Latest News
మాజీ ఎమ్మెల్యే వరదరాజులు కుమారుడు, అనుచరులపై కేసు నమోదు
author img

By

Published : Oct 7, 2020, 8:29 AM IST

Updated : Oct 7, 2020, 3:56 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కుమారుడు కొండారెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. హైదరాబాద్‌ శ్రీనగర్ కాలనీకి చెందిన వ్యాపారి శివ గణేశ్​​.. తనకి చెందిన రెండున్నర ఎకరాల స్థలాన్ని కొండారెడ్డి బెదిరించి ఆయన పేరిట రాయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కొండారెడ్డితో పాటు మరో 17మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మాజీ ఎమ్మెల్యే వరదరాజులు కుమారుడు, అనుచరులపై కేసు నమోదు

బెదిరించి మరీ రిజిస్ట్రేషన్..​

పొద్దుటూరులో శివ గణేశ్​కు రెండున్నర ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలం వివాదంలో ఉండటంతో వరదరాజులు రెడ్డి బంధువు రామచంద్రారెడ్డిని శివ గణేశ్​ సంప్రదించాడు. వివాదం పరిష్కరిస్తే ఎకరం స్థలం ఇస్తానంటూ ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో రామచంద్రారెడ్డి వివాదం పరిష్కరించారు. కాగా ఎకరం స్థలంతో పాటు మిగిలిన స్థలాన్నీ తమకు రిజిస్టర్​ చేయాలంటూ 9 నెలలుగా వ్యాపారిని కొండారెడ్డి బెదిరిస్తూ వచ్చారు.

గత నెల 26న కొండారెడ్డి గన్‌మెన్​తో పాటు మరికొంతమంది అనుచరులను తీసుకొని శ్రీనగర్ కాలనీలోని శివ గణేశ్​ కార్యాలయానికి వెళ్లి బెదిరించారు. దీంతో ఎకరం స్థలం రిజిస్టర్ చేసుకోవాలంటూ మంగళవారం ఎర్రమంజిల్ కార్యాలయానికి రావాలని వ్యాపారి తెలిపాడు. రామచంద్రారెడ్డి, రవి రెడ్డి, ఇద్దరు గన్​మెన్లతో పాటు 15 మంది అనుచరులతో కలిసి అతన్ని బెదిరించి మొత్తం స్థలాన్ని కొండారెడ్డి తన పేరిట రాయించుకున్నారు. దీనిపై గణేశ్​ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కొండారెడ్డి, రామచంద్రారెడ్డి, రవి రెడ్డిలతో పాటు మరో 15 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: అక్రమంగా రవాణా చేస్తున్న 105 క్వింటాళ్ల రేషన్​బియ్యం స్వాధీనం

Last Updated : Oct 7, 2020, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.