ETV Bharat / jagte-raho

ఎస్​ఆర్​ఎస్పీ కాలువలో పడి బాలుడు మృతి - latest crime news in suryapeta

ఎస్​ఆర్​ఎస్పీ కాలువలో పడి బాలుడు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా మాణిక్యం తండాలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

a boy fall in srsp canal in suryapeta district
ఎస్​ఆర్​ఎస్పీ కాలువలో పడి బాలుడు మృతి
author img

By

Published : Aug 30, 2020, 7:26 PM IST

సూర్యాపేట జిల్లా నాగారం మండలం మాణిక్యం తండా లోవిషాదం జరిగింది. ఎస్​ఆర్​ఎస్పీ కాలువలో స్నానాకి వెళ్లిన బాలుడు అందులో పడి మృతి చెందాడు. మాణిక్య తండాకు చెందిన ధరావత్ లింగస్వామి, యమునకు సంతోష్, సందీప్ ఇద్దరు కుమారులు. వీరు ఇరువురు ఎస్​ఆర్​ఎస్పీ కాలువలో స్నానానికి వెళ్లారు.

స్నానం చేస్తుండగా​ ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడిపోయారు. సంతోష్ నీటిలో కొట్టుకు వెళ్తుండగా పక్కనే ఉన్న పశువుల కాపరులు చూసి అతన్ని కాపాడారు. సందీప్​ అప్పటికే నీటిలో మునిగి చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవీచూడండి: జాతీయ ఫోటోగ్రఫీ పోటీల్లో రాష్ట్రానికి రెండు అవార్డులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.