పిల్లలతో పాటు రోడ్డు మీద వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండకపోతే కన్నవారికి కడుపుకోత మిగలొచ్చు. లేదంటే పిల్లలు జీవితాంతం వైకల్యంతో ఉండాల్సి రావచ్చు. తాజాగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీబీనగర్‌లో రోడ్డు దాటుతున్న సమయంలో ఓ చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
బీబీనగర్ ఆస్పత్రి సమీపంలో రోడ్డుపై తల్లితో పాటు నడుచుకుంటూ వెళ్తున్న ఐదేళ్ల బాలుడు తల్లి చేయి వదిలి ఒక్కసారిగా రోడ్డు దాటడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ద్విచక్రవాహనంపై వస్తున్న వాహనదారుడు బాలుడిని ఢీకొట్టాడు. దీంతో ఆ చిన్నారి బైక్ కింద పడిపోయాడు. అక్కడున్న వాళ్లు బాలుడిని కాపాడారు. ఈ ఘటనలో బాలుడికి గాయాలు కాకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా వాహనదారుడికి స్వల్పగాయాలయ్యాయి.
ఇదీ చదవండి: భద్రాద్రిలో ఉత్తర ద్వార దర్శనం.. భక్తుల పరవశం