ETV Bharat / jagte-raho

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తొమ్మిది పశువులు మృతి - జనగామ జిల్లా తాజా వార్తలు

నిన్న సాయంత్రం పాలు ఇచ్చిన పశువులు.. తెల్లారేసరికి మృతి చెందడం జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అంకుశపూర్​లో కలకలం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

9 cows and buffaloes died at ankushapur in janagama district
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తొమ్మిది పశువులు మృతి చెందాయి
author img

By

Published : Jan 10, 2021, 4:07 PM IST

జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అంకుశపూర్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు సలీమ్, కాళిల్​కు చెందిన తొమ్మిది పశువులు మృత్యువాతపడ్డాయి. శనివారం సాయంత్రం పాలు పిండుకొని మేత వేసి రాగ.. ఉదయం వెళ్లి చూడగా మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. ఎవరో విషప్రయోగం చేసి చంపినట్లు వారు అనుమానిస్తున్నారు.

మృతి చెందిన పశువుల్లో 3 జేర్సీ ఆవులు, ఒక గేదె, 3 లేగ దూడలు, 2 దూడలు ఉన్నాయి. తాము వాటి సంపాదనతోనే బతుకుతున్నామని.. వాటి విలువ సుమారు 4 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై హరిత.. కేసు నమోదు చేసుకున్నారు. విచారణ చేపడతామని చెప్పారు.

ఇదీ చదవండి: సంక్రాంతికి కరకరలాడే జంతికలను చేసుకోండిలా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.