ఇవీ చూడండి: ఈతకని వెళ్లిన చిన్నారులు... విగత జీవిగా మారారు!
ఎస్వోటీ పోలీసులపై దాడి చేసిన నిందితులు అరెస్టు
ఈ నెల 9న ఎస్వోటీ పోలీసులపై దాడి చేసిన 10 మంది నిందితులలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా నలుగురు పరారీలో ఉన్నారని.. వారిని కూడా త్వరలో పట్టుకుంటామని అధికారులు తెలిపారు.
నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టగూడెం తండాలో ఈ నెల 9న రాత్రి అక్రమ బియ్యం వ్యాపారులు, ఎస్ఓటి పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు ఎస్వోటీ పోలీసులకు గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన 10 మంది నిందితులలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై హత్యాయత్నం, చీటింగ్, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం తదితర కేసులు నమోదు చేసి.. రిమాండ్కు తరలించినట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు. దాడికి పాల్పడ్డవారు చంటి, శ్రీకాంత్, ఉమేష్, హరి, సురేష్,భాస్కర్, నగేష్, ప్రభాకర్, మనోహర్, ఆంజనేయులుగా గుర్తించారు. వీరు పోలీసులపై దాడితో పాటు ధాన్యం బస్తాలు, ఓ బైక్ ను కాల్చి వేశారని గుర్తు చేశారు. వీరిలోమొదటి ఏడుగురు పుట్టగూడెం వాసులు కాగా, మిగిలిన వారు మల్లగూడెంకు చెందిన వారు. ఇందులో ఏ1,ఏ2,ఏ3,ఏ4 నిందితులు ఇప్పటికీ పరారీలో ఉన్నారన్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీస్ అధికారి ఆంజనేయులు తెలిపారు.
ఇవీ చూడండి: ఈతకని వెళ్లిన చిన్నారులు... విగత జీవిగా మారారు!
Intro:వాహనదారులు ఇబ్బందులు
Body:లత వాహనదారులు ఇబ్బందులు
Conclusion:గుంతల రోడ్లు వాహనదారులు ఇబ్బందులు
Body:లత వాహనదారులు ఇబ్బందులు
Conclusion:గుంతల రోడ్లు వాహనదారులు ఇబ్బందులు
Last Updated : Mar 16, 2019, 9:07 AM IST