నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్న ఘటనలో గాయపడిన 8 నెలల గర్భిణి రజిత(22) చికిత్స పొందుతూ మృతి చెందింది. నిజామాబాద్‌లోని ఆస్పత్రికి సోదరుడితో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: ఉరేసుకుని బిహార్‌కు చెందిన వ్యక్తి బలవన్మరణం