సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఏడు లక్షల రూపాయల విలువైన విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దిల్లీ నుంచి సికింద్రాబాద్ వచ్చిన పార్శిళ్లను తనిఖీ చేయగా నిషేధిత సిగరెట్లు బయటపడ్డాయి.
విశ్వసనీయ సమాచారంతో కస్టమ్స్, రైల్వే అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించి.. పార్శిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అదనపు కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఔటర్రోడ్పై వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం...