భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు గత రెండేళ్లుగా మావోయిస్టు పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారు. భద్రాద్రి, తూర్పుగోదావరి జిల్లాల మావోయిస్టు కమిటీ కార్యదర్శి ఆజాద్, మణుగూరు ఏరియా మావోయిస్టు కమిటీ నేతల సూచన మేరకు కరకగూడెం చుట్టుపక్కల ప్రాంతాల్లో పేలుడు సామగ్రిని అమర్చుతున్న ఈ ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు.
వీరి నుంచి పది జెలిటిన్ స్టిక్స్, 40 మీటర్ల వైరు, 3 డిటోనేటర్లు, రెండు టిఫిన్ బాక్సులు, ఆరు బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నట్లు మణుగూరు ఏఎస్పీ శబరీష్ ప్రకటించారు. మావోయిస్టు పార్టీ నాయకులు తమ సొంత ప్రయోజనాల కోసం అమాయక గిరిజన ప్రజల్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. మావోయిస్టు పార్టీ రోజురోజుకూ క్షీణిస్తూ ఉనికిని కోల్పోతున్న నాయకులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు.
ఇదీ చూడండి: ఊహించని ప్రమాదం... తప్పిన అపాయం