రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని స్వస్తిక్ అస్క్ అనే ప్లాస్టిక్ కుర్చీల కంపెనీలో వారం క్రితం రూ.5 లక్షల 40 వేల నగదు చోరీకి గురైంది. వెంటనే యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా సెక్యూరిటీ గార్డే దొంగతనం చేసినట్లు గుర్తించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
శంషాబాద్ ఉందానగర్ రైల్వే స్టేషన్లో సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ప్రకాశ్ రెడ్డి తెలిపారు. నిందితుని వద్ద లక్ష 40 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మిగతా నగదును ఏం చేశాడో దర్యాప్తు చేస్తురు. నిందితుడు అసోంకు చెందినవాడిగా గుర్తించారు.
ఇదీ చూడండి: ఆస్తికోసం కొడుకుల కుట్ర.. ఆలయంలో తలదాచుకున్న తల్లి..