హైదరాబాద్ రాజేంద్రనగర్ అత్తాపూర్‌కు చెందిన జగదీష్(24) ఆటో డ్రైవర్ పనిచేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడి ఏడు సంవత్సరాల నుంచి నగరంలోని వివిధ ఠాణా పరిధిలో11 దొంగతనాలు చేసి జైలుకు వెళ్లాడు. అత్యాచారం కేసులో జైలుకు వెళ్లిన బండ్ల సునీల్ అనే వ్యక్తితో జగదీష్ పరిచయం పెంచుకున్నాడు. కాగా కొద్దిరోజులకు వారిరువురు బెయిల్‌పై బయటకువచ్చారు. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతూ వచ్చిన సొత్తుతో కొద్దిరోజులు జల్సాలు చేసేవారు. వారిపై పలు చోరీ కేసులు నమోదయ్యయాయి.
ఇదే క్రమంలో వారం క్రితం ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొక్కానిగూడలో తాళం వేసిన ఇంట్లోకి ప్రవేశించి భారీగా బంగారం, వెండి, నగదు ఎత్తికెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ.. వాహనాలు తనిఖీ చేస్తున్న క్రైమ్ పోలీసుల అటుగా వెళ్తున్న సునీల్, జగదీశ్ సహా అతని స్నేహితులు రాజశేఖర్ (25), రాజుసెల్వ(21) అనుమానంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటపెట్టారు. వారి నుంచి కేజీన్నర వెండి, 66గ్రాముల బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపినట్లు సీఐ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: నాగార్జునసాగర్ 4 క్రస్ట్ గేట్లు ఎత్తిన అధికారులు