ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత మరిశాలలో పండుగ పూట విషాదం నెలకొంది. పుట్టినరోజు వేడుక కోసం గోదావరి ఒడ్డుకు వెళ్లిన 16 మంది యువకులు పార్టీ అనంతంర గోదావరిలో నదిలో ఈతకు దిగారు. ఈ క్రమంలోనే నలుగురు యువకులు గల్లంతయ్యారు. తుమ్మ కార్తిక్, అన్వేష్, శ్రీకాంత్, రాయవరపు ప్రకాశ్ ప్రమాదవశాత్తు నదిలో పడిపోయారు. వీరంతా వెంకటాపురం మండలంలోని రంజరాజపురం కాలనీకి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజఈతగాళ్ల సాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో రాయవరపు ప్రకాశ్, తుమ్మ కార్తీక్ మృతదేహాలు లభ్యం కాగా.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. చీకటి కావడంతో వారిని వెతకడం కాస్త ఇబ్బందిగా మారింది.