ETV Bharat / jagte-raho

చోరీలకు పాల్పడుతున్న అంతర్​ జిల్లా దొంగల అరెస్ట్​ - thieves arrested in east godavari district news

చెడు వ్యసనాలకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు యువకులను ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి భారీగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా స్నేహితులని జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి వెల్లడించారు.

4-gold-snatchers-arrested-in-east-godavari-districtin ap
చోరీలకు పాల్పడుతున్న అంతర్​ జిల్లా దొంగల అరెస్ట్​
author img

By

Published : Dec 6, 2020, 11:22 PM IST

గొలుసుల చోరీలకు పాల్పడుతున్న నలుగురు అంతర్ జిల్లా దొంగలను ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 28 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

అమలాపురం ప్రాంతానికి నలుగురు యువకులు పాత స్నేహితులు. వీరందరి వయసు 21 ఏళ్లు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన వీరు... చోరీల బాట పట్టారు. బంగారు గొలుసులు, ద్విచక్ర వాహనాలను కలిసి దొంగిలించారు. వీరిపై తూర్పు గోదావరి జిల్లాలో 17, పశ్చిమ గోదావరిజిల్లాలో 8, తెలంగాణలో ఒక కేసు నమోదు అయింది. నిందితులు శనివారం ఉదయం పోలీసులకు చిక్కారు. వారి నుంచి 582 గ్రాముల 26 బంగారు గొలుసులు, 5 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి:పోరాటం చరిత్రాత్మకం.. బంద్​లో భాగస్వామ్యం అవుతాం: ఉత్తమ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.