భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం చెక్పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వాహనంలో సోదాలు చేయగా 206కిలోల గంజాయి దొరికింది. దాని విలువ 30,95,000 ఉంటుందని సీఐ వినోద్ రెడ్డి తెలిపారు.
గంజాయి అక్రమ రవాణా చేస్తున్న యువతి సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా భద్రాచలం సారపాక బూర్గంపాడుకు చెందిన వారుగా గుర్తించారు.
ఇదీ చూడండి: గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు