కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గుట్కా స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్రమంగా గుట్కా విక్రయిస్తున్న శ్రీనివాస్, సతీశ్, వినయ్, శ్రీకాంత్, ఇజాజ్, అనిల్‌పై కేసు నమోదు చేశారు.
నిందితుల నుంచి సుమారు రూ. 3.2 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో ఇన్స్పెక్టర్ అభిలాష్, సిబ్బంది పాల్గొన్నారు. ఇలాంటి చట్టవ్యతిరేకమైన చర్యలకు ప్రజలు పాల్పడవద్దని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: భార్య కాపురానికి రాలేదని యువకుడు ఆత్మహత్య