వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇల్లంద శివారులో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ద్విచక్రవాహనం రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి ట్రాక్టర్ ఢీ కొట్టింది. తీవ్ర గాయాలైన ముగ్గురిని స్థానికులు 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
యువకులు నెక్కొండ మండలం టీకే తండాకు చెందిన జ్ఞానేశ్వర్, కాంత్రికుమార్, రాజేందర్‌గా పోలీసులు గుర్తించారు. చేపల కోసం వర్ధన్నపేటకు వచ్చి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.