ETV Bharat / jagte-raho

బోధన్​లో భారీ వర్షాలకు 3 ఇళ్లు నేలమట్టం - nizamabad district latest news

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు బోధన్​పట్టణంలోని 3 ఇళ్లు నేలమట్టమయ్యాయి. విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్​ కొత్తపల్లి రాధాకృష్ణ ఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించారు.

3 houses demolished due to heavy rains in Bodhan, nizamabad district
బోధన్​లో భారీ వర్షాలకు 3 ఇళ్లు నేలమట్టం
author img

By

Published : Aug 18, 2020, 2:00 PM IST

నిజామాబాద్​ జిల్లా బోధన్​ పట్టణంలోని మూడోవార్డులో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు... ఎల్​ఆర్​ క్వార్టర్స్​లో 3 ఇళ్ల గోడలు నేలమట్టమయ్యాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న వార్డు కౌన్సిలర్​ కొత్తపల్లి రాధాకృష్ణ ఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించారు.

అనంతరం మున్సిపల్​ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులకు ఫోన్​లో మాట్లాడి వారికి వాస్తవ పరిస్థితిని తెలియజేశారు. నిజాం షుగర్​ ఫ్యాక్టరీ నడుస్తున్న సమయంలో ఎల్​ఆర్​ క్వార్టర్స్​లను కార్మికుల కోసం నిర్మించారని కొత్తపల్లి రాధాకృష్ణ అన్నారు. ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదని.. వాటిని వెంటనే మరమ్మతులు చేయాలని కోరారు. క్వార్టర్స్​లో నివసిస్తున్న ప్రజలకు పట్టాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62శాతం మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.