సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన శంకర్ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇల్లు ధ్వంసమై... ఇంటి పై రేకులు పగిలిపోయాయి. పక్కనే ఉన్న ఇద్దరు సోదరుల ఇళ్లూ స్వల్పంగా ధ్వంసమయ్యాయి.
ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం సంభవించకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గ్యాస్ సిలిండర్ను తనిఖీ చేసి ఇవ్వకపోవడం వల్లే ప్రమాదం సంభవించిందని బాధితులు ఆరోపించారు. రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.