24 శ్రీ గంధం చెట్ల కర్రలను పెద్దపల్లి అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాలకుర్తి మండలం బసంత్ నగర్ స్టాఫ్ కాలనీలో పెంచుతున్న 4 చెట్లను నరికి.. కర్ర ముక్కలను దాచిపెట్టినట్లు అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ దేవదాసు తెలిపారు. ఒకచోట 16, మరోచోట 8 కర్రముక్కలు లభ్యమైనట్లు పేర్కొన్నారు.
4 క్వింటాళ్ల బరువున్న దుంగలను స్వాధీనం చేసుకుని కేశోరం ఠాణాకు పంపించామని దేవదాసు వెల్లడించారు. శ్రీ గంధం కర్ర కిలో రూ.5 వేల వరకు ఉంటుందని తెలిపారు. కాలనీలో మొత్తం ఎన్ని చెట్లు పెంచుతున్నారు? వాటిని నరికిన నిందితులు ఎవరనే దానిపై విచారణ చేస్తున్నట్లు పెద్దపల్లి ఎఫ్ఆర్ఓ సీహెచ్ నాగయ్య చెప్పారు.
ఇవీ చూడండి: హైదరాబాద్లో కిడ్నాప్ చేశారు.. జగిత్యాలలో పోలీసులకు చిక్కారు..