భద్రాచలం మల్కన్‌గిరి ఏజెన్సీ నుంచి ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న 20 లక్షల రూపాయల విలువచేసే 200 కిలోల ఎండు గంజాయిని మహబూబాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు.
మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా పోలీసుల వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో... గంజాయి తరలిస్తున్న కారును పట్టుకున్నట్లు తెలిపారు. వారిని రిమాండ్‌కు తరలించారు. మరోకరు పరారీలో ఉన్నట్లు చెప్పారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి మహబూబాబాద్, హైదరాబాద్, ఇతర రాష్ట్రాలలో విక్రయిస్తున్నారని వివరించారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని సమగ్రంగా విచారణ చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఇవీ చూడండి: గ్రేటర్‌లో కాస్త ఊరట... తాజాగా 273 మందికి వైరస్