ETV Bharat / jagte-raho

మద్యం మత్తు: ఢీకొట్టిన బైక్.. మహిళ సహా బైకర్​ మృతి - telangana news

మద్యం మత్తు ఇద్దరి ప్రాణాలు తీసింది. తాగిన మైకంలో అతి వేగంగా బైక్ నడుపుతూ మహిళ మృతికి కారణమయ్యాడు ఓ యువకుడు. ప్రమాదంలో మహిళతో పాటు అతడు కూడా అక్కడిక్కడే మృతి చెందాడు.

2 members died in the  road accident at shamshabad mandal in rangareddy district
నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టిన బైక్
author img

By

Published : Jan 27, 2021, 10:25 AM IST

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద తుప్పర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ద్విచక్రవాహనం బలంగా ఢీకొట్టింది. బైక్​ ఢీకొన్న వేగానికి మహిళ అక్కడిక్కడే మృతి చెందింది.

అనంతరం యువకుడి వాహనం.. సమీపంలోని విద్యుత్​ స్తంభాన్ని గుద్దింది. తీవ్రగాయాలైన యువకుడు కూడా ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: ఘోర రోడ్డు ప్రమాదం- 8 మంది దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.