ETV Bharat / jagte-raho

కిడ్నాప్​కేసు: బెయిల్​ కోసం 15 మంది నిందితుల పిటిషన్లు

బోయిన్‌పల్లి అపహరణ కేసులో నిందితుల బెయిల్​ పిటిషన్ల పర్వం కొనసాగుతోంది. ఒకవైపు అఖిలప్రియ భర్త భార్గవరామ్ కోసం​ పోలీసులు గాలిస్తుంటే... మరోవైపు ఆమె సోదరుడు జగత్​విఖ్యాత్​రెడ్డి ముందస్తు బెయిల్​ పిటిషన్​పై విచారణను ఈ నెల 29కి కోర్టు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే... ఈ కేసులో అరెస్టయిన 15 మందీ తమకు బెయిల్​ కావాలని కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

15 boinapalli kidnap case accused filed bail petition in secunderabad court

author img

By

Published : Jan 28, 2021, 8:38 AM IST

సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి అపహరణ కేసులో... పరారీలో ఉన్న అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బెంగళూరు, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. అఖిలప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సికింద్రాబాద్‌ కోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ కేసులో జగత్‌విఖ్యాత్‌రెడ్డికి బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని, రాజకీయ పలుకుబడితో దర్యాప్తుపై ప్రభావం చూపించే అవకాశం ఉందని పోలీసులు దాఖలు చేసిన కౌంటర్‌లో పేర్కొన్నారు.

మరోవైపు... ఇప్పటికే అరెస్టయిన 15 మంది తమకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ సికింద్రాబాద్‌ న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపైన కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. జగత్‌విఖ్యాత్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను సికింద్రాబాద్​ న్యాయస్థానం కొట్టివేస్తే... బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఇదీ చూడండి: 'మీ ఆరోగ్య సూత్రాలు నచ్చాయ్‌.. పెళ్లి చేసుకుందామా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.