నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సిద్దాపూర్లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహేశ్ (14)... వరుసకు సోదరుడయ్యే కపిల్ (13)తో కలిసి తమ ట్రాక్టర్‌పై వెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తుండగా బండారుపల్లి శివారులో డ్రైవర్ అశోక్ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో సడన్ బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో రెండు వాహనాలు రోడ్డు పక్కన కిందకు పడిపోయాయి. ట్రాక్టర్ ఇంజన్ భాగం మహేశ్‌పై పడగా... తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రున్ని నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కొడుకు విగతజీవిగా మారటంతో గుండెలవిసేలా రోధించారు. ఈ ప్రమాదంలో కపిల్, డ్రైవర్, ద్విచక్ర వాహనదారులు శంకర్, నయీం గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని బోధన్ గ్రామీణ సీఐ రవీందర్ నాయక్ తెలిపారు.