ETV Bharat / jagte-raho

నెత్తురోడిన రహదారులు... 12 మంది మృత్యువాత - హైదరాబాద్​లో రోడ్డు ప్రమాదం

రాష్ట్రంలో పలుచోట్ల ప్రమాదాలతో రహదారులు నెత్తురోడాయి. హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు.... 12 మందిని బలితీసుకోగా... పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా... మిగతా చోట్ల ఏడుగురు మృతిచెందారు.

10 members dead in road accidents in telangana
10 మందిని బలితీసుకున్న రహదారులు
author img

By

Published : Dec 13, 2020, 11:47 AM IST

Updated : Dec 13, 2020, 7:51 PM IST

హైదరాబాద్ గచ్చిబౌలి వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విప్రో సర్కిల్ వద్ద టిప్పర్-కారు ఢీకొని.... కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచాడు. మాదాపూర్ లోని ఓ వసతి గృహంలో నివసించే కాట్రగడ్డ సంతోష్, భరద్వాజ్ , పవన్, రోషన్, మనోహర్‌లు కలిసి తెల్లవారుజామున 3గంటల సమయంలో కారులో గచ్చిబౌలి నుంచి గౌలిదొడ్డి వైపు వెళ్తున్నారు. అతి వేగంతో దూసుకువచ్చిన కారు గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద రెడ్ సిగ్నల్‌ను అతిక్రమించింది. ఈ క్రమంలో అటునుంచి వచ్చిన టిప్పర్ -కారును ఢీకొనటంతో... రెండు వాహనాలు రోడ్డుపై పల్టీలు కొట్టాయి. కారు ఎగిరిపడటంతో... రోడ్డు పక్కనే తాగునీటి కోసం ఏర్పాటు చేసిన షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది.

మృతులు కాట్రగడ్డ సంతోష్, చింతా మోహన్, పప్పు భరద్వాజ్, రోషన్, పవన్‌గా పోలీసులు గుర్తించారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం సంగాయిగూడెంకు చెందిన సంతోష్ టెక్ మహీంద్రాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లికి చెందిన మనోహర్ , నెల్లూరు జిల్లాకు చెందిన రోషన్, పవన్ కుమార్, విజయవాడకు చెందిన భరద్వాజ్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్ కూకట్‌పల్లి వద్ద జరిగిన మరో ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. 836వ మెట్రో పిల్లర్ వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో... ప్రకాశ్ అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలో జరిగిన ప్రమాదంలో తల్లీకొడుకులు ప్రాణాలు కోల్పోయారు. మోకీల వద్ద వేగంగా వచ్చిన ఓ ద్విచక్రవాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొని... కొండకల్‌కు చెందిన శివయ్య, బుచ్చమ్మ మృతిచెందారు.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగిలో ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలొదిలారు. ద్విచక్రవాహనాన్ని కంటైనర్ ఢీకొనడంతో అక్కడిక్కడే మృతిచెందారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో మరో ఘటన చోటుచేసుకుంది. ఆటోను పాల ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా... మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి క్రాస్ రోడ్ లోనూ ప్రమాదం సంభవించింది. ద్విచక్రవాహనంపై తండ్రి, కుమారులు వెళుతుండగా.... లారీ ఢీకొట్టడంతో కుమారుడు అక్కడిక్కడే మృతి చెందాడు. తండ్రికి గాయాలయ్యాయి.

ఇదీ చదవండి: నిమిషం ఆగితే ఐదుగురి ప్రాణాలు నిలిచేవి

Last Updated : Dec 13, 2020, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.