ETV Bharat / international

ఇజ్రాయెల్​ కాల్పుల విరమణపై ప్రపంచ నేతల హర్షం - అమెరికా స్పందన

గాజాలోని హమాస్​తో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్​ మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ప్రపంచ దేశాల నేతలు స్వాగతించారు. కాల్పుల విరమణకు ఇరు పక్షాలు కట్టుడి ఉండాలని కోరుతున్నారు. శాంతిని నెలకొల్పేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Israel, Palestine
గాజా, ఇజ్రాయెల్​
author img

By

Published : May 21, 2021, 11:04 AM IST

11 రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించుతూ.. గాజాపై ఏకపక్ష కాల్పుల విరమణకు ఇజ్రాయెల్​ ఆమోదం తెలపడం పట్ల ప్రపంచ దేశాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ చర్యను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​ స్వాగతించారు. కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని ఇరు పక్షాలను కోరారు.

"11 రోజుల మారణ హోమం తర్వాత.. గాజా, ఇజ్రాయెల్​ల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పంద నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను."

- ఆంటోనియో గుటెరస్​, యూన్​​ ప్రధాన కార్యదర్శి

అమెరికా హర్షం..

ఇజ్రాయెల్​ తీసుకున్న కాల్పుల విరమణ ఒప్పందంపై.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. పాలస్తీనా-ఇజ్రాయెల్​లో శాంతి నెలకొల్పేందుకు ఇదో మంచి అవకాశం అని అభివర్ణించారు.

"ఇరు ప్రాంతాల వారికి స్వేచ్ఛగా, సురక్షితంగా జీవించే హక్కు ఉంది. ఘర్షణలు తలెత్తకుండా చూసేందుకు అమెరికా ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తుంది. ఐక్యరాజ్య సమితి, ఇతర భాగస్వామ్య దేశాలతో కలిసి గాజాలోని పాలస్తీనియన్ల పునర్నిర్మాణానికి మేం మానవతా సాయం అందిస్తాం."

-జో బైడెన్​, అమెరికా అధ్యక్షుడు

సద్వినియోగం చేసుకోవాలి..

గాజా, ఇజ్రాయెల్​లు కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఛార్లెస్​ మైఖెల్​ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.

"11 రోజుల ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ.. హమాస్, ఇజ్రాయెల్​ తీసుకున్న కాల్పుల విరమణ ఒప్పంద నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. పౌరుల శాంతి, భద్రతల కోసం వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి."

-చార్లెస్​ మైఖెల్, యురోపియన్​ కౌన్సిల్​ అధ్యక్షుడు.

ఇజ్రాయెల్​, పాలస్తీనా నాయకులతో తాను మాట్లాడానని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్​ తెలిపారు. కాల్పుల విరమణను స్వాగతిస్తున్నానని చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తు.చ. తప్పకుండా పాటించి పౌరుల ప్రాణాలను కాపాడాలని బ్రిటన్​ విదేశాంగ మంత్రి డోమ్నిక్​ రాబ్​ పేర్కొన్నారు. ఇజ్రాయెల్​, గాజాల నిర్ణయాన్ని కెనెడా స్వాగతించింది. కానీ, ఈ చర్య ప్రారంభం మాత్రమే అని చెప్పింది. చేయాల్సింది చాలా ఉందని పేర్కొంది.

తాజా నిర్ణయంపై పాలస్తీనియన్లకు ఉన్న సందేహాలను తీర్చడానికి అవసరమైతే మరో సమావేశాన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ఐరాస సాధారణ అసెంబ్లీ అధ్యక్షుడు వోల్కన్​ బోజ్​కిర్​ తెలిపారు.

యుద్ధం అంచుకు..

పాలస్తీనా నిరసనకారులు, ఇజ్రాయెల్​ పోలీసుల మధ్య ఇటీవల చెలరేగిన ఘర్షణలు రెండు దేశాలను యుద్ధం అంచుకు నెట్టాయి. అప్పటి నుంచి ఇజ్రాయెల్​ మిలిటరీ- హమాస్​ ఉగ్రవాదులు ఒకరిపై ఒకరు రాకెట్​ దాడులతో విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో 227మంది పాలస్తీనావాసులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 64మంది చిన్నారులు, 38మంది మహిళలు ఉన్నారు. మొత్తం 58వేల మంది ఇళ్లను విడిచి వసలవెళ్లిపోయారు.

ఇదీ చూడండి: 'భారత్​కు 4వేల మందికిపైగా మయన్మార్​ శరణార్థులు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.