యూఏఈ ప్రధాని ప్రధాని మంగళవారం కొవిడ్ టీకాను వేయించుకున్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని ట్విట్టర్లో తెలిపారు. యూఏఈలో మంచిరోజులు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాక్సిన్ వేయించుకుంటున్న ఫొటోను ట్విటర్ ద్వారా పంచుకున్నారు.
కరోనా రోగులతో కాంటాక్ట్ అయిన ఆరోగ్య కార్యకర్తలకు అత్యవసర సమయంలో కరోనా టీకా ఇచ్చేందుకు యూఏఈ ప్రభుత్వం అనుమతించింది. టీకా లైసెన్స్ కోసం అవసరమైన చర్యలు చేపడుతోంది.