ఇరాన్ ప్రభుత్వానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్లో నిరసనకారుల అణచివేతకు వ్యతిరేకంగా ట్విట్టర్ వేదికగా స్పందించారు.
"ఇరాన్ నాయకులకు హెచ్చరిక- మీ నిరసనకారులను చంపకండి. ఇప్పటికే వేల మంది ప్రాణాలు కోల్పోయారు.. అనేక మందిని జైళ్లల్లో పెట్టారు. ప్రపంచం మొత్తం మిమ్మల్ని గమనిస్తోంది. మరీ ముఖ్యంగా అమెరికా చూస్తోంది. మీ దగ్గర ఇంటర్నెట్ ఆన్ చేసుకోండి. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియజెప్పేలా మీ జర్నలిస్టులను అనుమతించండి! గొప్పవారైన మీ ఇరాన్ ప్రజలను హతమార్చడం ఆపండి." - ట్రంప్ ట్వీట్
ట్రంప్ ట్వీట్‌కు కొంత సమయం ముందు ఓ ఇంటర్వ్యూలో.. ఇరాన్ నేతలతో చర్చలకు ట్రంప్ ఇంకా సిద్ధంగా ఉన్నట్లు అమెరికా భద్రతా కార్యదర్శి మార్క్ ఎస్పర్ తెలిపారు.
ఇదీ చూడండి:ఉక్రెయిన్ విమానం కూల్చివేతకు వ్యతిరేకంగా ఇరాన్ ప్రజల నిరసన