టర్కీలో భారీ భూకంపం సంభవించింది. భూకంప ధాటికి ఇప్పటివరకు 14 మంది మృతి చెందారు. రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైన తీవ్రత.. టర్కీకి తూర్పున ఉన్న ఇలాజిజ్ ఫ్రావిన్స్‌లోని సివ్‌రిస్ జిల్లాలో సంభవించింది. భూకంపకేంద్రం సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. మృతుల్లో 8 మంది ఇలాజిజ్ ఫ్రావిన్స్‌కు చెందిన వారు కాగా... మరో ఆరుగురు మలాటయా ఫ్రావిన్స్‌కు చెందినవారుగా గుర్తించారు.
భూకంపం సంభవించినప్రాంతంలో భవనాలు తీవ్రంగా నేలకూలాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టర్కీ తూర్పు ప్రాంతంలో పలుచోట్ల భూమి కంపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. భూకంప తీవ్రత అధికంగా ఉండే జోన్‌లో టర్కీ ఉంది.