అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు కొనసాగుతున్నాయి. లాక్డౌన్ ఆంక్షలను లెక్క చేయకుండా వారాంతపు నిరసనల్లో వేలాది మంది పాల్గొన్నారు.
నెతన్యాహుపై జూన్ నుంచి విచారణ కొనసాగుతుండగా.. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అందుకు అంగీకరించని ఆయన పదవిలోనే కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రజలు భౌతిక దూరం నిబంధనలను పక్కనపెట్టి మరీ.. ప్రధాన మంత్రి అధికారిక నివాసం ఎదుట వేలాదిగా చేరి ఆందోళన చేపట్టారు. నెతన్యాహుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చూడండి: 39కి చేరిన టర్కీ భూకంప మృతుల సంఖ్య