ETV Bharat / international

ఇజ్రాయెల్​లో నిరసనలు- ప్రధాని రాజీనామాకు డిమాండ్ - బెంజమిన్ నెతన్యాహు

అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన పదవికి రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ప్రధాని నివాసం వెలుపల భారీ ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే కరోనా ప్రబలుతోందని, నిరుద్యోగం రెండంకెల స్థాయికి చేరిందని మండిపడ్డారు.

Thousands demand resignation of Israeli PM
ఇజ్రాయెల్​లో నిరనలు- ప్రధాని రాజీనామాకు డిమాండ్
author img

By

Published : Sep 13, 2020, 5:42 AM IST

Updated : Sep 13, 2020, 8:11 AM IST

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తాయి. నెతన్యాహు అధికారిక నివాసం వెలుపల పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు ప్రజలు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కరోనావైరస్ నియంత్రణలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు.

కరోనా నియంత్రణలో మెరుగ్గానే వ్యవహరిస్తోందని ప్రశంసలు అందుకున్న ఇజ్రాయెల్.. క్రమంగా వైరస్ విషయంలో పట్టు కోల్పోయింది. మే నెలలో వెంటనే లాక్​డౌన్​ను ఎత్తివేయడం వల్ల కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించకపోవడం వల్లే కరోనా ప్రబలుతోందని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. నిరుద్యోగం సైతం రెండంకెల స్థాయికి చేరిందని విరుచుకుపడుతున్నారు.

దానికి తోడు కరోనా

అవినీతి ఆరోపణలు ఉన్న నెతన్యాహు రాజీనామా చేయాలని ప్రతీ వారం నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు ప్రజలు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం కూడా భారీ నిరసనలకు కారణమైనట్లు తెలుస్తోంది.

2 బిలియన్ డాలర్ల విలువైన జర్మన్ సబ్​మెరైన్ల కొనుగోలు విషయంలో నెతన్యాహుకు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో.. సబ్​మెరైన్ ఆకృతులను చేతబట్టి ప్రజలు నిరసనకారుల్లో పాల్గొన్నారు.

Thousands demand resignation of Israeli PM
సబ్​మెరైన్ ఆకృతితో నిరసనల్లో ప్రజలు

నిరసనలను అదుపుచేయడంలో భాగంగా పోలీసులు కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది.

Last Updated : Sep 13, 2020, 8:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.