ETV Bharat / international

ప్రపంచ దేశాలపై కరోనా పంజా.. 3,595 మంది బలి!

కొద్ది నెలలుగా ప్రపంచదేశాల్ని వణికిస్తోన్న కరోనా వైరస్​.. మరింత వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే చైనాలో మూడువేల మందికి పైగా బలిగొన్న ఈ ప్రాణాంతక వైరస్​.. 94 దేశాలకు వ్యాపించింది. వైరస్​ను ఎదుర్కొనేందుకు కొన్ని దేశాల్లో ఆంక్షలు విధించారు. నివారణ చర్యల్లో భాగంగా.. హోలీ సహా పలు ఉత్సవాలను నిషేధించారు.

The number of coronavirus cases in the world stood at 105836 including 3595 deaths
ప్రపంచ దేశాలపై కరోనా పంజా.. 3,595 మంది బలి!
author img

By

Published : Mar 8, 2020, 8:23 PM IST

Updated : Mar 8, 2020, 11:49 PM IST

ప్రపంచ దేశాలపై కరోనా పంజా.. 3,595 మంది బలి!

ప్రపంచవ్యాప్తంగా.. కరోనా వైరస్​తో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 95 దేశాలలో విస్తరించిన ఈ వైరస్​ ధాటికి.. 3,595 మంది బలయ్యారు. మరో 1,05,836 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు.

ఇప్పటివరకు ఒక్క చైనాలోనే 3,097మంది మరణించగా.. మొత్తం బాధితుల సంఖ్య 80,965కు చేరింది. చైనా వెలుపలి దేశాల్లో.. వైరస్​ సోకి 498 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 25,141 కు పెరిగింది.

కరోనా ప్రభావం అధికంగా ఉన్న దేశాలు:

దేశంమృతులువైరస్​ కేసులు
చైనా 3,097 80,965
ఇటలీ 233 5,883
ఇరాన్​ 145 5,823
దక్షిణకొరియా 48 7,134
ఫ్రాన్స్ 16 949
  • ఆసియాలో 89,525 కరోనా కేసుల్లో.. 3,162 మంది మరణించారు.
  • ఐరోపాలో 9,655 కేసులు నమోదు కాగా.. 263 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • పశ్చిమాసియాలో 6,158 మందికి కరోనా సోకగా.. 149 మంది చనిపోయారు.
  • అమెరికా, కెనడా దేశాలలో 270 కేసుల్లో.. 16 మంది మృతిచెందారు.
  • ఓసియానా(ఆస్ట్రేలియా తదితర) ప్రాంతంలో 83 మంది వైరస్​ బారినపడగా.. ముగ్గురు బలయ్యారు.
  • లాటిన్​ అమెరికా, కరీబియన్​ దీవుల్లో 83 కేసులకు గానూ.. ఒకరు మరణించారు.

ఇరాన్​లో రికార్డు మరణాలు

ఇరాన్​లో ఒక్కరోజే 49 మందిని బలిగొంది కరోనా మహమ్మారి. 24 గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యలో ఇదే అత్యధికం. దీంతో.. ఆ దేశంలో మొత్తం మరణాల సంఖ్య 194కు చేరింది. దేశంలోని 31 రాష్ట్రాలకు విస్తరించిన ఈ మహమ్మారి ధాటికి.. 6,566 కేసులు నమోదయ్యాయి.

దక్షిణకొరియాలో తగ్గుముఖం

దక్షిణకొరియాలో కరోనా మరణాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందని అధికారులు తెలిపారు. ఆ దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 7,134కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 50కు చేరింది.

దుబాయ్​లో 'హోలీ' వేడుకలకు దూరం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దుబాయ్​లో పలు ఆంక్షలు విధించింది ప్రభుత్వం. హిందూ దేవాలయాల్లో హోలీ పండుగ వేడుకలను రద్దు చేసినట్లు ఆ దేశ​ ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు శివాలయాలు, కృష్ణాలయాల్లో ప్రార్థనా సమయాన్ని తగ్గించినట్లు సమాచారం. అంతేకాకుండా... భక్తులకు శానిటైజర్లను అందిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి: 'కరోనాను ఎదుర్కొనేందుకు సౌకర్యాలు పెంచండి'

Last Updated : Mar 8, 2020, 11:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.