ETV Bharat / international

భారత్​కు సంఘీభావంగా బుర్జ్ ఖలీఫాపై త్రివర్ణ పతాకం

కొవిడ్​-19కి వ్యతిరేకంగా భారత్​ చేస్తున్న పోరాటానికి గల్ఫ్ దేశం యూఏఈ మద్దతు తెలిపింది. 'స్టే స్ట్రాంగ్ఇండియా' పేరిట భారత జాతీయ జెండాను దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించి సంఘీభావం ప్రకటించింది.

burj khalifa
స్టే స్ట్రాంగ్ఇండియా
author img

By

Published : Apr 26, 2021, 9:14 AM IST

Updated : Apr 26, 2021, 9:35 AM IST

దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా సంక్షోభం పట్ల గల్ఫ్ దేశం యూఏఈ సంఘీభావం ప్రకటించింది. ఈ మేరకు దుబాయ్​లో నిర్మితమైన ప్రపంచంలోనే ఎత్తైన భవనం 'బుర్జ్ ఖలీఫా'పై 17 సెకన్ల పాటు త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించింది. దీనికి సంబంధించిన వీడియోను అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్​లో షేర్ చేసింది. భారత జాతీయ జెండాతో పాటు 'స్టే స్ట్రాంగ్ ఇండియా' అనే సందేశాన్ని సైతం బుర్జ్​ ఖలీఫా ప్రదర్శించింది.

కరోనాపై చేస్తున్న పోరులో విజయం సాధించాలని భారత్​కు స్నేహ దేశమైన యూఏఈ కోరుకుంటోందని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.

దుబాయ్‌లోని బుర్జ్​ ఖలీఫా ఆకాశహర్మ్యం 829.8 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తైన నిర్మాణంగా పేరొందింది.

ఇవీ చదవండి:

'కరోనాపై పోరులో భారత్​కు అండగా ఉంటాం'

భారత్‌కు సాయం ప్రకటించిన పాక్‌!

Last Updated : Apr 26, 2021, 9:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.