ETV Bharat / international

కువైట్ రాజు షేక్ సబా కన్నుమూత

author img

By

Published : Sep 29, 2020, 10:08 PM IST

కువైట్‌ రాజు షేక్‌ సబా అల్‌ అహ్మద్‌ అల్‌ సబా (91‌) కన్నుమూశారు. శస్త్ర చికిత్స కోసం జులైలో అమెరికా వెళ్లిన ఆయన.. అక్కడే తుది శ్వాస విడిచారు. అయితే ఆయనకు శస్త్రచికిత్స ఎందుకు జరిగిందన్న విషయాలు సహా.. మరణానికి గల కారణాలను అధికారులు వెల్లడించలేదు.

State television: Kuwaiti ruler Sheikh Sabah has died at 91
కువైట్ రాజు మృతి

కువైట్ రాజు షేక్ అల్ సబా అల్ అహ్మద్ అల్‌ సబా ఇకలేరు. అమెరికాలోని రోచెస్టర్‌లోని మాయో క్లినిక్‌లో కువైట్ ఎమిర్ షేక్ సబా అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా (91) కన్నుమూశారు. జులై 17న కువైట్‌లోనే శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన్ను తదుపరి చికిత్స కోసం జులై 19న ప్రత్యేక విమానంలో అమెరికాకు తరలించారు.

రాజు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటం వల్ల యువరాజు, సోదరుడు షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబా తాత్కాలికంగా ఎమిర్‌గా కొన్ని రాజ్యాంగ అధికారాలను అప్పగించారు. ఎమిర్‌ భౌతికకాయాన్ని కువైట్‌కు తరలించనున్నారు. సభా సోదరుడు, నేషనల్ గార్డ్ డిప్యూటీ కమాండర్ షేక్ మిష్ అల్ అహ్మద్ నేతృత్వంలోని బృందం భౌతికకాయంతో పాటే ఉంది. రాజు మరణంతో కువైట్‌లో సంతాప దినం ప్రకటించారు. అయితే, రాజుకు శస్త్ర చికిత్స ఎందుకు జరిగింది? అమెరికాలో వైద్య పరీక్షలకు సంబంధించిన వివరాలను మాత్రం ఆయన కార్యాలయం వెల్లడించలేదు. అయితే, షేక్‌ సబా అల్‌ అహ్మద్‌ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ నవాఫ్‌ అహ్మద్‌ అల్‌ సబా తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టినట్టు సమాచారం.

జననం

జూన్ 16, 1929న కువైట్ సిటీలోని షర్క్‌లో ఆ దేశ మాజీ ఎమిర్ షేక్ అహ్మద్ అల్ జాబేర్ అల్ సబా, మునీరా ఉస్మాన్ అల్ హమద్ అల్ సయీద్‌ దంపతులకు నాలుగో కుమారుడిగా జన్మించారు సబా. కువైట్‌లో విద్యనభ్యసించిన ఆయన ఆసియా, యూరోపియన్ దేశాలలో పరిపాలనా శిక్షణ పొందారు. 1953లో కార్మిక, సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలలో పనిచేశారు. 1963లో స్వతంత్ర కువైట్‌లో మొదటి సమాచార, ప్రసారాల మంత్రిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 1963 నుంచి 2003 వరకు 40ఏళ్ల పాటు విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ఆక్రమణ నుండి దేశం విముక్తి పొందిన తరువాత, ఆయన విదేశాంగ మంత్రి పదవికి అదనంగా ఉప ప్రధానిగా నియమితులయ్యారు.

2003లో అప్పటి అమిర్, షేక్ జాబర్ అహ్మద్ అల్ సబా ఆయనను ప్రధానిగా నియమించారు. అప్పటివరకు దేశానికి క్రౌన్ ప్రిన్స్ ప్రధానమంత్రి పదవిని కలిగి ఉన్న సంప్రదాయం ఉండేది. దీంతో చరిత్రలో ఉప ప్రధాని పదవి నుంచి నేరుగా ప్రధాని పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా షేక్‌ అల్‌ సబా రికార్డు సృష్టించారు. 2006, జనవరి 9న అప్పటి ఎమిర్ షేక్ జాబీర్ అల్ అహ్మద్ అల్ సబా మరణం తరువాత, క్రౌన్ ప్రిన్స్ షేక్ జాయెద్ అబ్దుల్లా సేలం ఆరోగ్య కారణాల వల్ల పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. 2006, జనవరి 29న షేక్ సబా కువైట్‌కు 15వ ఎమిర్ మరియు స్వతంత్ర కువైట్ యొక్క ఐదో ఎమిర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో 40 ఏళ్ల అనుభవం ఉన్న సమయంలో కువైట్‌ విదేశాంగ విధానం రూపకల్పనలో కీలక భూమిక పోషించారు. అరబ్‌ ప్రపంచంలో ప్రముఖ దౌత్యవేత్తగా, గొప్ప మానవతావాదిగా మన్ననలు పొందారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.