ETV Bharat / international

వారికే.. విదేశీ ప్రయాణాలకు సౌదీ అనుమతి - వ్యాక్సిన్ వేయించుకున్న పౌరులు విదేశీ ప్రయాణాలు చేయడానికి సౌదీ అనుమతి

వ్యాక్సిన్ వేయించుకున్న పౌరులు విదేశీ ప్రయాణాలు చేయడానికి సోమవారం నుంచి అనుమతినిచ్చింది సౌదీ అరేబియా. కరోనా కొత్త వేరియంట్ లను అరికట్టడానికి మార్చి 2020 నుంచి విదేశీ ప్రయాణాలను సౌదీ రద్దు చేసింది.

travel ban
విదేశీ ప్రయాణాలకు
author img

By

Published : May 17, 2021, 5:14 PM IST

14నెలల తర్వాత సౌదీ అరేబియాలో విదేశీ ప్రయాణాలు సోమవారం నుంచి మొదలయ్యాయి. వ్యాక్సిన్ వేయించుకున్న పౌరులు విదేశీ ప్రయాణాలు చేయడానికి అనుమతినిచ్చింది ఆ దేశ ప్రభుత్వం. సౌదీలో ఇప్పటివరకు 1.15 కోట్ల జనాభాకు కనీసం ఒక్క డోసునైనా అందించింది. వీరందరితో పాటు ఇటీవల కరోనా నుంచి కోలుకున్న వారిని, 18 ఏళ్ల కిందివారు విదేశీ ప్రయాణాలు చేయడానికి అనుమతినిచ్చింది. కరోనా కొత్త వేరియంట్ లను అరికట్టడానికి మార్చి 2020 నుంచి విదేశీ ప్రయాణాలను సౌదీ రద్దు చేసింది.

విమానాశ్రయాల్లో సౌదీపౌరులు తమ ఆరోగ్య ధ్రువీకరణ పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. అయితే.. విదేశాల నుంచి సౌదీకి వచ్చేవారికి మాత్రం గృహాలలోనే క్వారెంటైన్ నిబంధనలను విధించింది. అమెరికా, యూకే, యూఏఈ, ఫ్రాన్స్, భారత్, యెమెన్ లతో పాటు దాదాపు 20 దేశాలకు ప్రత్యేక పరిస్థితుల్లో మినహా ప్రయాణాల రద్దును కొనసాగించింది.

సౌదీలో ఇప్పటివరకు 4,30,000 కరోనా కేసులు నమోదయ్యాయి. 7,160 మంది మరణించారు. 1400 మంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.

ఇదీ చదవండి: ఆ విషయంలో హెచ్​1బీ వీసాదారుల వెంటే గూగుల్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.