పాకిస్థాన్ మ్యాప్ నుంచి పీఓకే, గిల్గిత్ బాల్టిస్థాన్‌ను ప్రాంతాలను సౌదీ అరేబియా తొలగించింది. ఈ విషయాన్ని పీఓకే ఉద్యమకారుడు అమ్జద్ అయ్యూబ్ మీర్జా ట్విట్టర్ ద్వారా బుధవారం తెలిపారు.
"భారత్‌కు దీపావళి బహుమతినిచ్చింది సౌదీ అరేబియా. పాకిస్థాన్ మ్యాప్ నుంచి పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్థాన్‌ను తొలగించింది. "
- అమ్జద్ అయ్యూబ్ మీర్జా
నవంబర్ 21-22 తేదీల్లో జరిగే జీ-20 సదస్సుకు సౌదీ అరేబియా అధ్యక్షత వహించనుంది. ఈ సందర్భంగా 20 రియాల్ బ్యాంక్ నోటును సౌదీ విడుదల చేసినట్లు కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. ఈ నోటుపై ముద్రించిన ప్రపంచ పటంలో.. పాకిస్థాన్‌లో కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్థాన్‌ను అంతర్భాగంగా చూపలేదని నివేదించాయి.
రెండు దేశాల మధ్య సంబంధాలు బలహీన పడిన నేపథ్యంలో సౌదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా సౌదీ కొత్త విధానాన్ని అనుసరిస్తోందని ఈ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
గిల్గిత్‌లో ఎన్నికలు..
గిల్గిత్ బాల్టిస్థాన్, కశ్మీర్‌తోపాటు భారత భూభాగాలైన జునాగఢ్, సర్‌క్రీక్, గుజరాత్‌లోని మనవాడార్ ప్రాంతాలను తమవిగా చెబుతూ ఇటీవల ఇమ్రాన్ ప్రభుత్వం జాతీయ పటాన్ని విడుదల చేసింది. గిల్గిత్ బాల్టిస్థాన్‌లో ఎన్నికలు నిర్వహించాలన్న పాకిస్థాన్ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది.
ఇదీ చూడండి: పాక్ 'గిల్గిత్' నోటిఫికేషన్‌పై భారత్ ఫైర్