ETV Bharat / international

భారత్​కు విమానాల రాకపోకలపై సౌదీ నిషేధం

author img

By

Published : Sep 23, 2020, 6:32 PM IST

భారత్‌కు విమానాల రాకపోకలను నిషేధించింది సౌదీ అరేబియా. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. బ్రెజిల్‌, అర్జెంటీనా దేశాల విమానాల రాకపోకలపైనా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది సౌదీ.

Saudi Arabia bans flights to and from India due to COVID-19 outbreak
భారత్​ విమానాల రాకపోకలపై సౌదీ నిషేధం!

దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. సౌదీ అరేబియా భారత్‌కు విమానాల రాకపోకలను నిషేధించింది. భారత్‌తో పాటు బ్రెజిల్‌, అర్జెంటీనాకు కూడా విమానాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు సౌదీకి చెందిన జనరల్‌ అథారిటీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ప్రకటించింది. ఆయా దేశాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

వారికి మినహాయింపు..

ఆ దేశాల్లోని వ్యక్తులు 14 రోజుల వరకు సౌదీ అరేబియా వచ్చేందుకు అనుమతి ఉండదని తెలిపింది. అయితే, సౌదీ ప్రభుత్వ ఆహ్వానం ఉన్నవారికి మినహాయింపు ఉన్నట్లు పేర్కొంది. ఈ నిషేధం ఎంతకాలం వరకు అమలులో ఉంటుందన్న విషయాన్ని వెల్లడించలేదు.

భారత విమానాలు సౌదీ అరేబియాలో సేవలు అందించేందుకు అనుమతి లేదని, గల్ఫ్‌ దేశాల నుంచి కూడా భారత్‌కు విమానయాన సేవలు సెప్టెంబర్‌ 24 వరకు అందుబాటులో ఉండవని ఓ విమానయాన సంస్థ అధికారి తెలిపారు. సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయం... మరిన్ని ఇతర దేశాలు కూడా భారత్‌పై నిషేధం విధించేందుకు దారితీస్తుందని పరిశీలకులు అంటున్నారు.

ఇదీ చూడండి: రికార్డు బ్రేక్​- అక్కడ మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.