కరోనా బారినపడి కోలుకున్న వారికి ఫైజర్ బయోఎన్‌టెక్ సంస్థలు ఉత్పత్తి చేసిన టీకా ఒకే డోసు సరిపోతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇలాంటివారిలో బలమైన రోగనిరోధక ప్రతిస్పందన వెలువడిందని పేర్కొంది. వారికి ఇన్ఫెక్షన్ ఎప్పుడు సోకింది, వారిలో గుర్తించదగ్గ స్థాయిలో యాంటీబాడీలు ఉన్నాయా అన్నదానితో సంబంధం లేకుండా ఈ స్పందన ఉందని తెలిపింది. ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కొవిడ్ టీకాకు సంబంధించిన ప్రయోగాల డేటా సానుకూలంగానే ఉన్నప్పటికీ వాస్తవ ప్రపంచంలో వ్యాక్సిన్‌కు సంబంధించి వెలువడుతున్న ఆధారాలు అస్పష్టంగా ఉన్నాయని అధ్యయనకర్తలు తెలిపారు.
ఇప్పటికే కొవిడ్ బారినపడిన వారిపై ఈ టీకాలు ఎలా పనిచేస్తాయన్నది ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదని చెప్పారు. వాలంటీర్లలో 17 మంది 1-10 నెలల కిందట కొవిడ్ బారినపడ్డారు. టీకా ఇవ్వడానికి ముందు వారిలోని యాంటీబాడీల స్థాయిని పరిశీలించారు. వారికి ఫైజర్-బయెఎన్టెక్లు రూపొందించిన బీఎన్టీ162బి2 ఎంఆర్ఎన్ఏ టీకాను ఇచ్చారు. ఆ తర్వాత వారిలో యాంటీబాడీలను పరిశీలించారు. ఒక్క డోసుతోనే వారిలో బలమైన రోగ నిరోధక ప్రతిస్పందన ఉత్పన్నమైందని తేల్చారు. దీంతో కొవిడ్ బారినపడి కోలుకున్నవారికి ఒక డోసు సరిపోతుందా అన్న చర్చకు తెరలేచిందని వారు చెప్పారు.
ఇదీ చదవండి : 88.5 లక్షల మందికి టీకా పంపిణీ: కేంద్రం