బహ్రెయిన్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ... రాజధాని మనామాలోని 200 ఏళ్లనాటి శ్రీనాథ్జీ (శ్రీకృష్ణ) దేవాలయాన్ని సందర్శించారు. ఆయనకు ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. మోదీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి... అర్చకుల ఆశీర్వచనాలు పొందారు. అక్కడ కలయదిరుగుతూ ఆలయ విశేషాలు అడిగి తెలుసుకున్నారు.
శ్రీకృష్ణ ఆలయ అభివృద్ధి ప్రాజెక్ట్‌కు శ్రీకారం
శ్రీకృష్ణ ఆలయ అభివృద్ధికి సంబంధించి 4.2 మిలియన్ డాలర్ల ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇందులో భాగంగా 16,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 అంతస్తులుగా ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇందులో ఐకానిక్ కాంప్లెక్స్, గర్భగుడి, ప్రార్థనా మందిరాలను ఆధునికంగా తీర్చిదిద్దుతారు. అభివృద్ధి పనులు ఈ ఏడాది చివరలో ప్రారంభం కానున్నాయి.
ఇదీ చూడండి: జీ-7: మోదీ-ట్రంప్ భేటీలో ప్రధాన అంశాలు ఇవేనా?