ETV Bharat / international

భార్యను మేకప్​ లేకుండా చూసి భర్త షాక్​- విడాకులకు దరఖాస్తు - ఇంటర్నేషనల్​ న్యూస్

పెళ్లైన మొదటి రోజు తర్వాత భార్యను మేకప్​ లేకుండా చూసి కంగుతిన్నాడు ఓ భర్త. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె అందం సహజమైనది కాదని పసిగట్టలేకపోయాడు. ఇక ఆమెతో కలిసుండలేనని విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు.

Man Seeks Divorce From Wife After Seeing Her Without Makeup
భార్యను మేకప్​ లేకుండా చూసి భర్త షాక్​- విడాకులకు దరఖాస్తు
author img

By

Published : Nov 5, 2021, 2:19 PM IST

Updated : Nov 5, 2021, 5:07 PM IST

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను మేకప్ లేకుండా చూసి అవాక్కయ్యాడు ఓ భర్త. ఆమె సహజమైన అందాన్ని చూసి బిత్తరపోయాడు. ఇన్నాళ్లు తాను ప్రేమించిన అందగత్తె ఈమేనా అని వాపోయాడు. వివాహమైన మర్నాడే అతనికి ఈ విచిత్ర పరిస్థితి ఎదురైంది.

ఈజిప్టుకు చెందిన ఈ వ్యక్తికి కొద్దిరోజుల క్రితం ఓ అమ్మాయితో ఫేస్​బుక్​లో పరిచయం ఏర్పడింది. రోజూ చాటింగ్ చేసుకుని ఇద్దరూ దగ్గరయ్యారు. ఆమె అందాన్ని ఫొటోల్లో చూసి అతడు మంత్రముగ్ధుడయ్యాడు. ఆమెను నేరుకు కలిసేందుకు తహతహలాడాడు. పలుమార్లు డేటింగ్​కు కూడా వెళ్లాడు. పెళ్లంటూ చేసుకుంటే ఇలాంటి అందగత్తెనే చేసుకోవాలనుకున్నాడు. ఎలాగోలా ఆమెను ఒప్పించి ఘనంగా వివాహం చేసుకున్నాడు. తీరా పెళ్లైన మర్నాడే అమె అసలు అందం చూసి మనోడు కంగుతిన్నాడు. మేకప్ లేకుండా ఆమెను దగ్గరి నుంచి అస్సలు చూడలేకపోయాడు. 'నిన్నమొన్నటి వరకు నేను చూసింది ఈమెనేనా?' అనుకున్నాడు. మేకప్ లేకుండా తన భార్య అందంగా కనిపిస్తుందేమోనని నెల రోజుల వరకు ఎదురు చూశాడు. ఇక ఫలితం లేకా తనతో కలిసి ఉండలేనని విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.

'ఆమె నిజమైన అందం చూసి నేను షాక్ అయ్యా. నేను ఆమెను పలుమార్లు కలిశా. ఫేస్​బుక్​లో ఆమె పంపిన ఫొటోలకు ఇప్పుడు కనిపిస్తున్న దానికి అసలు పొంతనే లేదు. మేకప్​ లేకుండా చూస్తే ఆమె పూర్తి భిన్నంగా ఉంది. నేను ఇక ఆమెతో ఉండలేను. విడాకులు కావాలి' అని హెలిపోలీస్ ఫ్యామిలీ కోర్టులో తన గోడు వెళ్లబోసుకున్నాడు ఆ వ్యక్తి. భార్యలు 24 గంటలూ మేకప్ వేసుకుంటే ఇలాంటి సమస్యలు రావని అన్నాడు.

2016లో యూఏఈలోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. మేకప్​ లేకుండా భార్యను చూసిన భర్త విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు.

ఇదీ చదవండి: Viral video: లిఫ్ట్​లో బెల్ట్​​ ఇరుక్కుని వేలాడిన శునకం

Last Updated : Nov 5, 2021, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.