ETV Bharat / international

బీరుట్​లో భయంభయం- మళ్లీ 'అమ్మో'నియం లభ్యం

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో జరిగిన భారీ పేలుడు ఘటన మరువకముందే అక్కడి ఓడరేవులో మరో 4 టన్నుల అమోనియం నైట్రేట్​ లభ్యమైంది. లెబనాన్​ సైన్యం వీటిని స్వాధీనం చేసుకుని పోర్ట్​ నుంచి తరలించింది.

Lebanese
లెబనాన్​ అమ్మోనియం
author img

By

Published : Sep 4, 2020, 3:38 PM IST

చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు.. తెగిపడ్డ శరీర భాగాలు.. ముక్కలు ముక్కలైన వాహనాలు.. శిథిలాలుగా మారిన భవనాలు... సరిగ్గా నెల క్రితం లెబనాన్​ రాజధాని బీరుట్​లో పరిస్థితి ఇది. ఆ భయానక ఘటన మరువక ముందే బీరుట్​ ఓడరేవులో 4 టన్నుల అమోనియం నైట్రేట్​ను ఆ దేశ సైన్యం గుర్తించింది.

తమకు వచ్చిన సమాచారం మేరకు లెబనాన్​ సైన్యం ఓడరేవులో తనిఖీలు చేపట్టింది. దాదాపు 4.35 టన్నుల ప్రమాదకర రసాయనాలున్న కంటైనర్లను గుర్తించింది. వీటిని ఓడరేవు నుంచి ఎవరూ లేని ప్రాంతాలకు జాగ్రత్తగా తరలించినట్లు సైన్యం తెలిపింది. అయితే ఈ కంటైనర్లు ఎక్కడి నుంచి వచ్చాయనేది తెలియాల్సి ఉంది.

అత్యంత దయనీయం...

లెబనాన్​ చరిత్రలో అత్యంత ఘోరమైన విషాదం జరిగిన నెల రోజుల తర్వాత మళ్లీ అమోనియం నైట్రేట్​ లభ్యమవడం యావత్​ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దాదాపు 3 వేల టన్నుల ప్రమాదకర అమోనియం నైట్రేట్​ పేలి దాదాపు 191 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 6 వేల మంది గాయపడ్డారు. సుమారు 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. బిలియన్​ డాలర్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది.

ఈ ఘటనపై ఎఫ్​బీఐ సహా ఫ్రెంచ్​ నిపుణులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు మొత్తం 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఎక్కువ మంది అక్కడ పనిచేసేవారు కస్టమ్స్​ అధికారులే కావడం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.