ETV Bharat / international

జీతాలు ఇవ్వలేని స్థితికి కువైట్‌ సర్కార్! - kuwait economy collapse

కరోనా దెబ్బకు కువైట్​లో పరిస్థితులు తారుమారయ్యాయి. దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరాయి. దీంతో ఆదాయానికి భారీగా గండిపడింది. ఒక్కసారిగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇదిలా ఉంటే అక్కడి ప్రజలు మాత్రం బంగారాన్ని ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు.

kuwait facing economical crisis due to coronavirus lockdown
వేతనాలు ఇవ్వలేని స్థితికి కువైట్‌ ప్రభుత్వం!
author img

By

Published : Nov 29, 2020, 2:35 PM IST

కొవిడ్‌ లాక్‌డౌన్‌ తర్వాత మన దేశంలో ఏం జరుగుతోంది? దుకాణాలు తెరిచారు.. బస్సులు నడుపుతున్నారు. విమానాలూ ఎగురుతున్నాయ్‌. కువైట్‌లోనూ అదే జరిగింది. అయితే.. ఒక విషయంలో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. అదేంటంటే.. అన్ని దేశాల్లో సరుకుల కోసమో, ఆహారం కోసమో క్యూ లైన్లలో నిలబడ్డారు. కువైట్‌లో మాత్రం నగల దుకాణాల వద్ద సందడి కనిపించింది. అవును.. మీరు చదివింది నిజమే.

కారణాలు తెలుసా?

ప్రపంచంలోనే అత్యంత ధనవంత దేశాల్లో ఒకటి కువైట్‌. మరి నగల షాపుల ముందు ప్రజలు బారులు తీరడం పెద్ద వింతేమీ కాదని అనుకోవచ్చు. అయితే దేశం ఆర్థిక సంక్షోభంలోకి వెళుతుందేమోనన్న భయంతో, తమకు భరోసా ఉండేందుకే బంగారాన్ని కొనుగోలు చేయాలని అక్కడి పౌరులు భావించడమే ప్రస్తుత స్థితికి కారణం.

సంక్షోభం.. ఎందుకంటే..

కరోనా కోరలు ప్రపంచమంతటా విస్తరించాయి. గిరాకీ కొరవడి చమురు ధర జీవనకాల కనిష్ఠాలకు చేరింది. ఫలితంగా చమురు ఉత్పత్తి దేశమైన కువైట్‌కు ఆదాయం భారీగా తగ్గింది. ఎన్నడూ లేనంతగా ఆ దేశం రుణ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

  • ఇతర గల్ఫ్‌ దేశాల లాగానే కువైట్‌ కూడా తన దేశంలోని 90 శాతం మంది పౌరులకు ఉద్యోగాలిచ్చింది. భారీ ప్రయోజనాలను అందజేస్తోంది.
  • అంతే కాదు.. చౌక విద్యుత్, ఇంధనంతో పాటు.. ఉచిత ఆరోగ్య సంరక్షణ, విద్యను పౌరులకిస్తోంది. అయితే కరోనాతో అంతా తల్లకిందులైంది. చమురు ధరలు తగ్గడంతో దేశం ఆదాయం క్షీణించడంతో వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి త్వరలోనే రావొచ్చని ఆ దేశ ఆర్థిక మంత్రే హెచ్చరించారు.
  • మరో వైపు ఆ దేశ చరిత్రలోనే తొలిసారిగా మూడీస్‌ కువైట్‌ సార్వభౌమత్వ రుణ రేటింగ్‌ను తగ్గించింది కూడా.
  • ఈ ఏడాది స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో దేశ లోటు 40 శాతానికి చేరొచ్చని కువైట్‌ జాతీయ బ్యాంకు అంచనా వేసింది. 1990ల్లో ఇరాక్‌ దండయాత్ర, గల్ఫ్‌ యుద్ధం సమయంలో ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభం తర్వాత మళ్లీ సంక్షోభం రావడం ఇదే తొలిసారి.

స్వయం కృతమా?

ముడి చమురు ధరలు బారెల్‌కు 40 డాలర్లకు కొద్దిగా అటూ ఇటూ కదలాడుతుండడంతో చాలా వరకు అరబ్‌ దేశాలు ముందు జాగ్రత్త చర్యలు పాటించాయి. సబ్సిడీలను తగ్గించాయి. పన్నులను విధించాయి. వ్యయాలను అదుపులో పెట్టుకున్నాయి. కువైట్‌ మాత్రం అలా చేయలేదు. ఈ ఏడాది బడ్జెట్‌లో బ్రేక్‌ ఈవెన్‌ ధర బారెల్‌కు 86 డాలర్లు. అంటే ప్రస్తుత విక్రయాలు రెట్టింపు అయితే మినహా బడ్జెట్‌కు నిధులు కేటాయించలేని పరిస్థితి. దీంతో ఆర్థిక ఒత్తిడి పెరిగింది.

ఇప్పుడు ఏం చేస్తుంది?

అయితే అంతర్జాతీయ సదస్సుల్లో త్వరలోనే ఈ దేశం సహాయం కోసం అర్థించడం జరగకపోవచ్చు. ఎందుకంటే ద కువైట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ వద్ద 533 బిలియన్‌ డాలర్ల ఆస్తులున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద నాలుగో ఫండ్‌ ఇది. అయితే ప్రస్తుత పరిమితి అయిన 33 బిలియన్‌ డాలర్లకు మించి వ్యయం చేయడానికి కువైట్‌కు అధికారం లేదు. అందుకు ఆ దేశ పార్లమెంటు ఒప్పుకోవాలి. అయితే అరబ్‌ దేశాల్లో అలా జరగడం దాదాపు అసాధ్యం. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పబ్లిక్‌ డెట్‌ బిల్‌ ద్వారా కువైట్‌ 65 బిలియన్‌ డాలర్ల రుణం చేసి ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు అవకాశం ఉంది. డిసెంబరు 5 ఎన్నికల తర్వాత కువైట్‌ కొత్త నేతలు ఈ బిల్లు భవిష్యత్‌ను నిర్ణయిస్తారు. అయితే మొత్తం వ్యవస్థే అవినీతిమయం అయిపోయిందని రీ ఎలక్షన్‌లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి ఒకరు ఆరోపిస్తున్నారు. రుణ పరిమితిని పెంచితే విదేశీ బ్యాంకులు, కుబేర వర్తకుల జేబులు నిండుతాయామోనన్న భయాలున్నాయి.

ఇదీ చదవండి: ఫక్రజాదే హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.