ETV Bharat / international

వీడని ప్రతిష్టంభన- ఎన్నికల్లో గెలిచినట్లు నెతన్యాహు ప్రకటన!

ఇజ్రాయెల్​ పార్లమెంటు ఎన్నికల్లో గొప్ప విజయం సాధించినట్లు ప్రకటించుకున్నారు ప్రధాని బెంజమిన్​ నెతన్యాహు. తన నేతృత్వంలోని రైట్​ వింగ్​ లికుడ్​ పార్టీకి దేశ ప్రజలు విజయాన్ని అందించారని ఫేస్​బుక్​లో పోస్ట్​ చేశారు. అయితే.. విజేత ఎవరో స్పష్టత లేదని ఎగ్జిట్​ పోల్స్​ తేల్చాయి. ఎవరికీ మెజార్టీ రాలేదని సంకేతాలిచ్చాయి.

Israel's Netanyahu claims 'great victory' in election
గెలిచినట్లు నెతన్యాహు ప్రకటన!
author img

By

Published : Mar 24, 2021, 4:30 AM IST

Updated : Mar 24, 2021, 5:25 AM IST

ఇజ్రాయెల్​ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని బెంజమిన్​ నెతన్యాహు.. తాను గెలుపొందినట్లు ప్రకటించుకున్నారు. తుది ఫలితాలు ఇంకా వెలువడనప్పటికీ తన నేతృత్వంలోని రైట్​ వింగ్​ లికుడ్​ పార్టీకి దేశ ప్రజలు విజయాన్ని కట్టబెట్టారని మంగళవారం సాయంత్రం ఫేస్​బుక్​లో పోస్ట్​ చేశారు.

''నా నాయకత్వంలోని రైట్​ వింగ్​ లికుడ్​ పార్టీకి ఇజ్రాయెలీలు గొప్ప విజయాన్ని అందించారు.''

- బెంజమిన్​ నెతన్యాహు, ఇజ్రాయెల్​ ప్రధాని

ఎగ్జిట్​ పోల్స్​ ప్రకారం.. దేశంలో అతి పెద్ద పార్టీగా 'లికుడ్​' అవతరించింది. రైట్​ వింగ్​ పార్టీలూ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి, కానీ ఇందులో కొన్ని నెతన్యాహుకు వ్యతిరేకమని, ఈ నేపథ్యంలో ఆయన తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పరిచే విషయంలో అనిశ్చితి నెలకొందని అంచనా వేశాయి.

మళ్లీ ప్రతిష్టంభన..

ప్రస్తుత ఎన్నికల ఫలితాలతో దేశంలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగే సూచనలున్నాయని ఎగ్జిట్​ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఏ ఒక్కరూ మెజార్టీ సాధించలేదని అంచనా వేశాయి.

120 స్థానాలున్న ఇజ్రాయెల్​ పార్లమెంట్​లో ఆధిక్యం కోసం 61 స్థానాలు అవసరం. ఎగ్జిట్​ పోల్స్​ ప్రకారం.. మిత్రపక్షాలతో కలిసి నెతన్యాహు పార్టీకి 53-54 సీట్లు, ఆయన ప్రత్యర్థులు 59 స్థానాల్లో గెలిచే అవకాశముంది.

అయితే.. ఇక్కడ నటాలీ బెన్నెట్​కు చెందిన యామినా పార్టీ కీలకంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయన పార్టీ.. 7-8 స్థానాల్లో గెలవొచ్చని తెలుస్తోంది.

తుది ఫలితాలు ఎగ్జిట్​ పోల్స్​ లెక్కలతో సరితూగితే.. వారికి నటాలీ మద్దతు అత్యవసరం. అయితే.. తనకు ప్రధానిగా అవకాశమిస్తే మద్దతిస్తానని నటాలీ చెప్పడం విశేషం. పూర్తి ఫలితాలు వెలువడేందుకు రోజులు పట్టొచ్చు. అప్పటివరకు నెతన్యాహు భవితవ్యంపై అనిశ్చితి వీడేలా లేదు.

రెండేళ్లలో నాలుగు సార్లు..

ఇజ్రాయెల్​లో రెండేళ్ల వ్యవధిలో ఇప్పుడు జరిగినవి నాలుగో ఎన్నికలు. అధికారం చేపట్టి 7 నెలలు గడవకముందే గతేడాది డిసెంబర్​లో నెతన్యాహు ప్రభుత్వం కుప్పకూలింది. గడువులోపు బడ్జెట్​ను ఆమోదించడంలో పార్లమెంట్ విఫలం కావడం వల్ల సర్కార్ పడిపోయింది. దీంతో మళ్లీ ఎన్నికలు అనివార్యమయ్యాయి.

ఇదీ చూడండి: పాక్​ ప్రధాని​ ఇమ్రాన్​​కు మోదీ లేఖ

Last Updated : Mar 24, 2021, 5:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.