ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన బాట పట్టారు ఆ దేశ ప్రజలు. కరోనా మహమ్మారి వల్ల ఆర్ధిక సంక్షోభం ఏర్పడినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందంటూ టెల్ అవీవ్‌లో ఆందోళనకు దిగారు.
కరోనా సంక్షోభం వల్ల నష్టపోయిన వందలాది కార్మికులకు, వ్యాపార సంస్థల యజమానులకు ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సాయం చేయటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టెల్ అవీవ్‌తో పాటు జెరూసలేం, ఇతర ప్రధాన నగరాల్లోనూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు.
![Israelis protest against 'out of touch' government](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8087998_thu.jpg)
![Israelis protest against 'out of touch' government](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8087998_thus.jpg)
ఆందోళనకారులను చెదరగొట్టెందుకు పోలీసులు వారిపై జలఫిరంగులను ప్రయోగించారు.
![Israelis protest against 'out of touch' government](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8087998_thuw.jpg)
ఇజ్రాయెల్‌లో ఇప్పటి వరకు దాదాపు 50 వేల మంది మహమ్మారి బారిన పడ్డారు. 400 మంది మృతి చెందారు.
ఇదీ చూడండి:ఓలి 'శ్రీ రాముని' వ్యాఖ్యలపై ఢాకాలో నిరసనలు