ఇజ్రాయెల్ బలగాలకు, హమాస్ ఉగ్రవాదుల మద్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ బలగాలు బుధవారం మరోసారి గాజా నగరంపై వైమానిక దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో గాజాలో ఓ భారీ భవనం కుప్పకూలింది.
ఈ ఘటన దృశ్యాలు.. స్థానిక ఇజ్రాయెల్ టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యాయి. గాజా ఉగ్రవాదులు రాకెట్లతో ప్రతిదాడులు చేస్తారని కథనాలు వెలువడ్డాయి.
గాజాలో మంగళవారం కూడా ఓ భవనంపై దాడి జరగగా.. హమాస్ ఉగ్రవాదులు ప్రతి దాడి చేశారు.
ఇదీ చూడండి: 43కు చేరిన గాజా మృతుల సంఖ్య