ఉత్తర ఇరాక్‌లో అమెరికా బలగాలు ఉన్న ఇర్బిల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో రాకెట్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. కుర్దిష్ ప్రాంతంలోని పౌర విమానాశ్రయం, అమెరికా దళాల స్థావరాలకు మధ్య ప్రాంతంలో మూడు రాకెట్లు దాడి చేసినట్లు భద్రతా అధికారులు తెలిపారు. అయితే దీనిపై ఎవరూ ప్రకటన చేయలేదని పేర్కొన్నారు.
కార్లు, ఆస్తి నష్టం వాటిల్లినట్లు భద్రతా అధికారులు తెలిపారు. కిర్కుక్ ప్రావిన్స్ సరిహద్దుకు సమీపంలో ఇర్బిల్‌కు దక్షిణాన ఉన్న ప్రాంతం నుంచి ఈ రాకెట్లను ప్రయోగించినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: ప్రకృతి బీభత్సంలో 10కి చేరిన మృతులు