దేశంలోని ఏకైక అణు విద్యుత్ కర్మాగారాన్ని అత్యవసరంగా మూసివేయాలని ఇరాన్ నిర్ణయించింది. దీనికి కారణాలేమిటనేది ప్రభుత్వం వెల్లడించలేదు. శనివారం నుంచి మొదలైన మూసివేత ప్రక్రియ మూడు నాలుగు రోజులపాటు కొనసాగనుందని మాత్రం తెలిపింది.
దక్షిణ ఇరాన్‌లోని ఓడరేవు నగరమైన బుషెహర్‌లో నెలకొన్న ఈ అణు విద్యుత్ కర్మాగారాన్ని అత్యవసరంగా మూసివేయాల్సి రావడం ఇదే ప్రథమం. దీని కారణంగా విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు తలెత్తుతాయని భావిస్తున్నారు.
ఇదీ చూడండి: చైనా- ఇరాన్ ఒప్పందం- భారత విధానాలకు ముప్పు!