గల్ఫ్‌లో ఓ విదేశీ ట్యాంకర్‌ను ఇరాన్ స్వాధీనం చేసుకుంది. అక్రమంగా చమురు రవాణా చేస్తుందనే ఆరోపణలతో ఈ ట్యాంకర్‌ను అదుపులోకి తీసుకుంది. విదేశీ ట్యాంకర్లను ఇరాన్ స్వాధీనం చేసుకోవడం ఈ నెలలో ఇది మూడో సారి. వరుస పరిణామాల నడుమ ఇరాన్, అమెరికా మధ్య మరోసారి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
ఫార్సీ ఐలాండ్ సమీపంలో తాజాగా ఈ ట్యాంకర్‌ను ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డులు పట్టుకున్నట్లు స్థానిక అధికారిక మీడియా ప్రకటించింది. స్వాధీనం చేసుకున్న ఆ ట్యాంక్ ద్వారా 7 లక్షల లీటర్ల అక్రమ చమురు తరలిస్తున్నట్లు పేర్కొంది. అందులో ఉన్న ఏడుగురు సిబ్బందిని వారు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి: ఇరాన్ అదుపులోకి ట్యాంకర్ల పూర్తి విరాలు