ETV Bharat / international

కరోనాతో ఇరాన్​ విలవిల- రంగంలోకి సైన్యం! - ఇరాన్​ కరోనా వైరస్​

ఇరాన్​లో కరోనా వైరస్​తో ఇప్పటివరకు 77మంది ప్రాణాలు కోల్పోయారు. 23మంది చట్టసభ్యులకూ కరోనా సోకడం ఆ దేశస్థులను కలవరపెడుతోంది. మరోవైపు కరోనా బారిన పడుతున్న ప్రపంచదేశాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

Iran orders troops to fight coronavirus outbreak as 77 dead
కరోనాతో ఇరాన్​ విలవిల- రంగంలోకి సైన్యం!
author img

By

Published : Mar 3, 2020, 10:57 PM IST

ప్రపంచ దేశాలను కరోనా వైరస్​ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. వైరస్​ కేంద్రబిందువైన చైనాలో మృతుల సంఖ్య తగ్గుతుండగా.. ఇతర దేశాల్లో గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఇరాన్​లో వైరస్​ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఆందోళనకరంగా ఉంది. ఆ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 77మంది మరణించారు.

ఇరాన్​లో 23మంది చట్టసభ్యులకు కుడా కరోనా సోకడం ఆందోళన కలిగించే అంశం. అనేకమంది చట్టసభ్యులు వీరికి దూరంగా ఉంటున్నారు. ఈ పరిణామాలతో సైన్యాన్ని అప్రమత్తం చేశారు ఇరాన్​ సుప్రీమ్​ నేత అయాతుల్లాహ్​​ అలీ ఖామేనేయీ. అవసరమైనప్పుడు ఆరోగ్యశాఖ అధికారులకు సహాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 3లక్షల మంది సైనికులతో కరోనాపై యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.

దేశాల సంఖ్య...

మరోవైపు కరోనా బారినపడుతున్న దేశాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ జాబితాలోకి తాజాగా ఉక్రెయిన్​ చేరింది. 70దేశాలకుపైగా వ్యాపించిన ఈ వైరస్​... ఇప్పటి వరకు దాదాపు 3వేల 100మందిని బలితీసుకుంది. మరో 90వేల మందికి వైరస్​ సోకింది.

ఇటలీలోనూ ఇదే పరిస్థితి. తాజాగా పోప్​ ఫ్రాన్సిస్​కు జలుబు చేయడం, దగ్గు రావడం వల్ల అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పరీక్షల్లో వైరస్​ లక్షణాలు కనపడకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అమెరికా అప్రమత్తం...

అమెరికా రాజధాని వాషింగ్టన్​లోని హోంల్యాండ్​ సెక్యూరిటీ కార్యాలయం మూతపడింది. ఓ ఉద్యోగికి వైరస్​ సోకిందనే అనుమానంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. రెండు వారాల వరకు కార్యలయాన్ని మూసివేయనున్నట్టు స్పష్టం చేశారు.

ఇంటి నుంచే పని...

వైరస్​ నేపథ్యంలో సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్​ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయమని కోరింది.

ఇదీ చూడండి:- 'కరోనా దెబ్బకు దిక్కుతోచని స్థితిలో ప్రపంచం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.