ETV Bharat / international

సొంత నౌకపైనే ఇరాన్ క్షిపణి దాడి-19 మంది మృతి

ఇరాన్ నేవీ శిక్షణ కార్యక్రమంలో ప్రమాదవశాత్తుగా జరిగిన క్షిపణి పేలుడులో 19 మంది మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోర్ట్ ఆఫ్ జాస్క్​లో జరిగిన ఈ ఘటనలో ఇరాన్​కే చెందిన 'కొనరక్'​ నౌకపై క్షిపణి దాడి జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

Iran missile strikes own ship, kills 1 sailor
సొంత నౌకపైనే ఇరాన్ క్షిపణి దాడి-19 మంది మృతి
author img

By

Published : May 11, 2020, 2:12 PM IST

ఇరాన్​ గల్ఫ్ ఆఫ్​ ఒమన్​ ప్రాంతంలో ప్రమాదవశాత్తు జరిగిన క్షిపణి పేలుడులో 19 మంది నావికులు మరణించారు. ఈ ఘటనలో మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఆదివారం జరిగిన ఈ ఘటనలో తొలుత ఒక్కరే మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే మరణాల సంఖ్య 19కి చేరినట్లు తాజాగా ప్రకటించారు.

మీడియా కథనం

టెహ్రాన్​కు ఆగ్నేయాన 1,270 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోర్ట్ ఆఫ్ జాస్క్​లో ఈ ప్రమాదం జరిగింది. శిక్షణ సమయంలో జరిగిన ఈ ఘటనలో లక్ష్యానికి సమీపంలో ఉన్న 'కొనరక్​' సహాయక నౌకను క్షిపణి ఢీకొట్టినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. లక్ష్యానికి దగ్గరగా ఉండటం వల్లే కొనరక్ నౌకపై ప్రమాదవశాత్తుగా ఈ దాడి జరిగినట్లు పేర్కొంది.

అమెరికా నో కామెంట్

వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధికి దగ్గర్లో ఉన్న ఈ ప్రాంతంలో ఇరాన్​ తరచుగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తూ ఉంటుంది. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం ఈ మార్గం నుంచే వెళ్తుంది.

ఈ కారణంగానే అమెరికా నేవీకి చెందిన ఐదవ నౌకాదళం ఈ ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో తాజా ఘటన జరగడం గమనార్హం. అయితే ఈ ఘటనపై అగ్రరాజ్యం ఇప్పటివరకు స్పందించలేదు.

నౌక కథాకమామీషు..

ఇరాన్ మీడియా కథనాల ప్రకారం కొనరక్ నౌకకు 2018లో మరమ్మత్తులు చేసి క్షిపణి ప్రయోగాల కోసం తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఈ నౌకకు సముద్ర క్షిపణులు, యాంటీ షిప్ మిస్సైల్స్​ ప్రయోగించే సామర్థ్యం ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. 47 మీటర్ల ఈ నౌక 1988 నుంచి నేవీలో సేవలందిస్తోంది. 40 టన్నుల బరువు సహా 20 మంది నావికులను మోసుకెళ్లగలదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.