ETV Bharat / international

సిరియాపై వైమానిక దాడి- 40 మంది మృతి!

సిరియాపై ఇజ్రాయెల్​ వైమానిక దాడులు జరిపింది. ఆ దేశంలోని ఇరాన్​ సైనిక స్థావరాలు, ఆయుధగారాలే లక్ష్యంగా బాంబులతో విరుచుకుపడింది. దాడుల్లో 9 మంది జవాన్లతో సహా 40 మంది మృతి చెందినట్లు బ్రిటన్​- సిరియా మానవహక్కుల సంస్థ తెలిపింది.

Intense Israeli airstrikes in east Syria said to kill dozens
సిరియాపై వైమానిక దాడులతో విరుచుపడిన ఇజ్రాయెల్​
author img

By

Published : Jan 14, 2021, 12:57 PM IST

సిరియాలో ఉన్న ఇరాన్​ సైనిక స్థావరాలు, ఆయుధగారాలే లక్ష్యంగా ఇజ్రాయెల్​ బుధవారం.. వైమానిక దాడులు జరిపింది. ఈ దాడిలో పదుల సంఖ్యలో జవాన్లు మృతి చెందినట్లు ఇజ్రాయెల్​ తెలిపింది. డీర్ ఆల్​ జో పట్టణ ప్రాంతంలో 18 వైమానిక దాడులు చేసినట్లు పేర్కొంది. ఈ దాడిలో 40 మంది ప్రజలు మృతి చెందారని, 37 మందికి గాయలైనట్లు బ్రిటన్​- సిరియా మానవహక్కుల సంస్థ తెలిపింది. మృతుల్లో 9 మంది సైనికులున్నారని పేర్కొంది.

అమెరికా ఇచ్చిన సమాచారం మేరకే ఇజ్రాయెల్​ వైమానిక దాడులు చేసిందని యూఎస్​కు చెందిన ఓ నిఘా అధికారి వెల్లడించారు. అమెరికా సహకారంతో ఇజ్రాయెల్​ ఇలా దాడులు చేస్తుందని తెలిపారు. ఇరాన్​కు సంబంధించిన ఆయుధాల్ని సిరియా ఆయుధగారాల్లో ఉంచినందుకే దాడులు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇరాన్​ చేపట్టనున్న అణు పరీక్షలకు కావల్సిన సామగ్రిని అక్కడి ఆయుధ స్థావరాల్లోని పైప్​లైన్​ ద్వారా చేరవేస్తున్నారని వెల్లడించారు.

కాగా వైమానిక దాడుల గురించి మంగళవారమే.. అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో, ఇజ్రాయెల్​ గూఢచారి సంస్థ అధ్యక్షులు యొస్సీ కోహెన్​తో చర్చించినట్లు ఆయన తెలిపారు.

సిరియాలోని డీర్ ఆల్​ జో​ పట్టణ సమీపంలోని ప్రాంతాలలో ఇజ్రాయెల్​ వైమానిక దాడులు చేసినట్లు సిరియా మీడియా వెల్లడించింది.

ఇదీ చూడండి: చైనాను తిప్పికొట్టే శక్తి భారత్‌కే ఉంది: అమెరికా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.