ETV Bharat / international

దుబాయ్​లో మరో భారతీయుడిని వరించిన అదృష్టం - another indian got UAE lucky draw

దుబాయ్​లో మరో భారతీయుడిని అదృష్టం వరించింది. ఓ లాటరీలో దాదాపు రూ. 40లక్షల ప్రైజ్​మనీని గెలిచాడు. ఈ డబ్బుతో తన తల్లిదండ్రులను బాగా చూసుకుంటానని తెలిపాడు.

Indian man wins over USD 54,000 in weekly draw in UAE
దుబాయ్​లో మరో భారతీయుడిని వరించిన అదృష్టం
author img

By

Published : Jan 22, 2021, 5:57 PM IST

యూఏఈలో మరో ప్రవాస భారతీయుడిని అదృష్టం తలుపు తట్టింది. దుబాయిలో నిర్వహించిన లక్కీడ్రాలో ఆరు అంకెలకుగాను ఐదు అంకెలను పొంది.. శివిన్​ విల్సన్​ అనే ఇంజనీర్​.. ప్రైజ్​మనీగా రూ.39,75,835 గెలుచుకున్నాడు.

ఇండియాలోని కేరళకు చెందిన శివిన్​.. దుబాయ్​లోని ఓ పెట్రో కెమికల్​ ప్లాంట్​లో ఇంజనీర్​గా పనిచేస్తున్నాడు. కాగా జనవరి 16న తీసిన లక్కీడ్రాలో రూ.39,75,835 గెలుచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. తోటి స్నేహితుల ప్రోత్సాహంతోనే తను ఈ లాటరీలో పాల్గొన్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ డబ్బును తన విద్యావసరాలకోసం, తల్లిదండ్లుల బాగోగులకోసం ఉపయోగించనున్నట్లు తెలిపాడు. కాగా లక్కీడ్రా మొదటి ప్రైజ్​ కింద రూ.99,30,63,160 నిర్వాహకులు ఇవ్వనున్నారు.

డిసెంబర్​లో అబుదాబిలో నిర్వహించిన ఓ లాటరీ డ్రాలో జార్జ్​ జాకొబ్(51) అనే వైద్య పరికరాల అమ్మకందారుడు విజేతగా నిలిచాడు. ప్రైజ్​మనీగా 3 మిలియన్​ డాలర్లు(రూ.22.13 కోట్లు) అందుకున్నాడు.

ఇదీ చూడండి: దుబాయ్​లో భారతీయుడిని వరించిన అదృష్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.